చెత్త తొలగింపులో నిర్లక్ష్యం తగదు
వరంగల్ అర్బన్/రామన్నపేట: చెత్త తొలగింపులో నిర్లక్ష్యం తగదని మేయర్ గుండు సుధారాణి హెచ్చరించారు. ఆదివారం వరంగల్ 29వ డివిజన్‌లోని పలు కాలనీల్లో, పోతన నగర్‌కు సమీపంలోని సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మేయర్ ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పేరుకుపోయిన చెత్త కుప్పలను పరిశీలించి పారిశుద్ధ్య జవాన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటా చెత్తను సేకరిస్తే రోడ్లు, మూలమలుపులు, ఖాళీ స్థలాల వద్ద ఎందుకు చెత్త పేరుకుపోతోందని ప్రశ్నించారు. ఇంటింటా చెత్తను అందించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం బల్దియా పోతననగర్‌లో నిర్వహిస్తున్న సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో చెత్త నిర్వహణ తీరును పరిశీలించి కంపాక్టర్ల పని తీరును పర్యవేక్షించారు. ఏజెన్సీ నిర్వాహకులు కంపాక్టర్లను సమర్థవంతంగా నిర్వహించాలని కంపాక్టర్ మరమ్మతుకు గురైతే చెత్త తరలింపులో జాప్యం కలగకుండా ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేసి అందుబాటులో ఉంచాలన్నారు.
మేయర్ గుండు సుధారాణి
సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ తనిఖీ


