మాడవీధుల పనుల్లో వేగం పెంచండి
నయీంనగర్: భద్రకాళి ఆలయ మాడ వీధుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. భద్రకాళి ఆలయ మాడ వీధుల నిర్మాణం, పురోగతి, సుందరీకరణ పనులతోపాటు రోప్ వే, గ్లాస్ బ్రిడ్జివే ఏర్పాటుపై కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అధికారులతో ఎమ్మెల్యే ఆదివారం ‘కుడా’ కార్యాలయంలో సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు పనుల వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ భద్రకాళి ఆలయ మాడ వీధుల విస్తరణకు ఉన్న అడ్డంకులను తొలగించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి


