రెండు బైక్‌లు ఢీ.. తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడి మృ
హసన్‌పర్తి: రెండు బైక్‌లు ఎ దురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ తాత్కాలిక పా రిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన వంగపహా డ్ శివారులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన ఇల్లందుల సదానందం(38) స్థా నిక జీపీలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఇదే మండలం బుచ్చయ్యపల్లిలోని తన అత్తగారింటికి బైక్‌పై బయలుదేరాడు. వంగపహాడ్ శివారుకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న మరో బైక్ సదానందంను ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై రవి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడికి భార్య సుమలత, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.


