
బండి సంజయ్‌పై వ్యక్తిగత దూషణలు సహించం
బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల
అధ్యక్షులు కొలను సంతోశ్‌రెడ్డి,
గంట రవికుమార్
హన్మకొండ/వరంగల్ చౌరస్తా: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోశ్‌రెడ్డి, గంట రవికుమార్ అన్నారు. గురువారం హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో, వరంగల్ చౌరస్తాలోని బీజేపీ కార్యాలయంలో వేర్వేరుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.. మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు ఏదో ఒక రాగం ఎత్తుకునే రాహుల్ గాంధీ బిహార్ ఎన్నికల ముందు ఓటు చోరీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఓటు చోరీ జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నారన్నారు. హనుమకొండ జిల్లా సమావేశంలో రావుల కిషన్, కార్పొరేటర్లు రావుల కోమల, గుజ్జుల వసంత, నాయకులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సమావేశంలో నా యకులు కుసుమ సతీశ్, రత్నం సతీశ్ షా, వన్నాల వెంకటరమణ, బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకుల రఘునారెడ్డి, గోకే వెంకటేశ్, కూచన క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.