
ఉత్తమ ఫలితాలు సాధించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
న్యూశాయంపేట : ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలు పెంపొందించుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శుక్రవారం హనుమకొండ హంటర్‌రోడ్‌లోని మైనార్టీ బాలికల గురుకులాన్ని ఆమె తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్, కిచెన్‌లను సందర్శించి అక్కడి నిత్యావసరాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి చదువు ఎలా సాగుతుందని ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్‌ఎల్‌సీ జంగా సతీశ్, ప్రిన్సిపాల్ నీరజ పాల్గొన్నారు.
అభ్యంతరాలు తెలియజేయాలి..
హన్మకొండ అర్బన్: జిల్లాలో అన్ని జీపీల్లో ప్రదర్శించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో అభ్యంతరాలుంటే నేడు (శనివారం) నాటికి తెలియజేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో.. జీపీల్లో ప్రదర్శించిన ఓటర్ల ముసాయిదా జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రెండు చోట్ల ఓటు ఉన్నవారిని తొలగించాలని ఆ జాబితాను కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీపీఓ లక్ష్మీరమాకాంత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ. శ్రీనివాస్‌రావు, ఇండ్ల నాగేశ్వర్‌రావు, నిశాంత్, ప్రభాకర్‌రెడ్డి, రజినీకాంత్, ఎండీ నేహాల్, శ్యాంసుందర్, సయ్యద్ ఫైజుల్లా, ఏసోబు, తదితరులు పాల్గొన్నారు.
కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి సత్వర చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో చర్చించిన అంశాలను ఎజెండాలో పొందుపర్చుతామన్నారు.
భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించండి
భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూభారతి దరఖాస్తుల పరిశీలన, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు.