
‘బడా’ పన్ను వసూళ్లు చేపట్టాలి
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: బడా బకాయిదారులే లక్ష్యంగా సీరియస్‌గా పన్ను వసూళ్లు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో పన్ను వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్ ప్రతీ రోజు 10 బిల్లులు తప్పకుండా వసూలు చేయాలని, పెద్ద మొత్తంలో బకాయి ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ఇళ్లు మంజూరైన వారు ఇప్పటి వరకు నిర్మాణ పనులు మొదలుపెట్ట కపోతే నోటీసులు జారీ చేయాలని, స్పందించకపోతే రద్దు చేయాలన్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం జాబితాలు అందజేయాలని సూచించారు.