
అత్యవసర పనులు పూర్తి చేస్తున్నాం
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ: అత్యవసరమైన ప్రతీ పనిని త్వరగా పూర్తి చేస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. 58వ డివిజన్ పరిధి హనుమకొండ స్నేహనగర్‌లో అంతర్గత రోడ్ల నిర్మాణ పనుల్ని గురువారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాధాన్య క్రమంలో గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం 57వ డివిజన్ హనుమకొండలోని ముంపునకు గురయ్యే అశోకా కాలనీ, గోకుల్‌నగర్ ప్రాంతాలను వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనల్ చాహత్ బాజ్‌పాయ్, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, నాయకులు కె.రాజేశ్వర్‌రావు, బంక సంపత్ యాదవ్, తాళ్లపల్లి సుదాకర్, మండల సమ్మయ్య, అశోకా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, డీఈ సారంగం, వర్క్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.