
‘కాశిబుగ్గ సర్కిల్’లో మహిళా మార్ట్
● మేయర్ గుండు సుధారాణి
● ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు
వరంగల్ అర్బన్: వరంగల్ కాశిబుగ్గ సెంటర్‌లోని బల్దియా సర్కిల్ కార్యాలయం కమర్షియల్ కాంప్లెక్స్‌లో మహిళా మార్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం సర్కిల్ కార్యాలయాన్ని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఆమె పర్యవేక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. స్వయం సహాయక మహిళా సంఘాల వారి వివిధ రకాల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మహిళా మార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. అనంతరం నగరంలోని వివిధ కాలనీల్లో శిథిలావస్థకు చేరిన భవన నిర్మాణాల్ని మేయర్, కమిషనర్ పరిశీలించి ప్రమాదకరంగా ఉన్న భవనాలను యుద్ధ ప్రతిపాదికన తొలగించాలన్నారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లకు నోటీసులు జారీ చేసి, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీలు ఖలీల్ ప్రశాంత్ ఇన్‌చార్జ్ ఈఈ సంతోశ్‌బాబు, సూపరింటెండెంట్ హబీబ్ ఆర్‌ఓ షెహజాదీ బేగం, టీపీఎస్‌లు అనిల్ శ్రీకాంత్ ఏఈ హబీబ్ పాల్గొన్నారు.
మాన్‌సూన్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి
మాన్‌సూన్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. గురువారం హనుమకొండ పరిధి జవహర్‌నగర్, గోపాల్‌పూర్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి వర్షాలు కురుస్తున్న క్రమంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సిబ్బందికి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి అధికారులు పాల్గొన్నారు.