
వి‘భిన్న’ వినాయకా
గ్రేటర్ వరంగల్ పరిధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ సెట్లు వేసి గణనాథులను ప్రతిష్ఠించారు. ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు. నగరంలోని పలు కాలనీల్లో వి‘భిన్న’ వినాయకులు ఏర్పాటు చేశారు. వరంగల్‌లో డ్రైప్రూట్స్‌తో, రుద్రాక్షలతో, అద్దాలతో రూపొందించిన ప్రతిమలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. హనుమకొండలోని ఓ ఆస్పత్రి ఆధ్వర్యంలో ‘సే టు నో డ్రగ్స్’ పేరిట మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్న సందేశం ఇస్తూ గణపతి మండపంలో పోలీస్, డ్రగ్ ఎడిక్ట్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. – సాక్షి, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్లు హన్మకొండ/వరంగల్

వి‘భిన్న’ వినాయకా