
మా మొర ఆలకించవా..గణనాథ
● 317 జీఓ బాధిత టీచర్ల ఆవేదన
విద్యారణ్యపురి: మా మొర ఆలకించవా..గణనాథ అని హనుమకొండలోని పలువురు 317 జీఓ బాధిత ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా బుధవారం పలు చోట్ల గణనాథుడి విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు కూరపాటి సత్యప్రకాశ్‌రావు మాట్లాడుతూ స్థానికత ఆధారంగా తమ సమస్యలను పరిష్కరించేలా సీఎంకు కనువిప్పు కలగాలని వేడుకున్నామన్నారు. బాధిత ఉపాధ్యాయులు శ్రీని వాస్, రమాదేవి, ఆగయ్య, రాజమౌళి తదితరులు ఉన్నారు.