
సెల్‌ఫోన్ దొంగల అరెస్టు
వరంగల్ క్రైం: వినాయక చవితి పండుగ సందర్భంగా హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లష్కర్ బజార్‌లో వస్తువులు తీసుకుంటుండగా కొంతమంది దొంగలు ప్రజల దృష్టి మరలించి సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడినట్లు ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు సెల్‌ఫోన్ దొంగలను అరెస్టు చేసి వారినుంచి రూ.1.50 లక్షల విలువ గల మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు బీహార్‌కు చెందిన షేక్ షాహీన్‌షా, జార్ఖండ్‌కు చెందిన బిష్ణుమ్యాతో, బబ్లూ మ్యాతో, షేక్ దీల్‌దార్ షేక్ నిహాల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బంది రవూప్, అశోక్, మహేందర్‌లను ఇన్‌స్పెక్టర్ శివకుమార్ అభినందించారు.