
బ్యాంకు అభివృద్ధే ధ్యేయం..
ఖిలా వరంగల్ : వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకును ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని, రూ.5కోట్ల టర్నోవర్‌తో కొనసాగుతున్న బ్యాంకు రూ.400 కోట్లతో అభివృద్ధిలో దూసుకెళ్తోందని ఆ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. శుక్రవారం వరంగల్ కాశిబుగ్గలోని అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నూతన కమిటీ ప్రమాణస్వీకారం జరిగింది. అధ్యక్షుడిగా ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, వైస్ చైర్మన్‌గా తోట జగన్నాథం, డైరెక్టర్లుగా నీలం మల్లేశం, మందా స్వప్న, బానోత్ సీతా మహాలక్ష్మి, చకిలం ఉపేందర్, కూరపాటి చంద్రమౌళి, ఐన వోలు వెంకటసత్యమోహన్, వడ్నాల సదానందం, ముందాడా వేణుగోపాల్, రపత్తి కృష్ణ, మహ్మద్ సర్వర్ అహ్మద్ పాషా.. ఎన్నికల అధికారి వాల్యా నాయక్ నేతృత్వంలో ప్రమాణస్వీకారం చేశారు. నంతరం జరి గిన కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు ప్ర దీప్‌రావు మాట్లాడారు. 1995లో ఒక్క శాఖతో ప్రా రంభమైన బ్యాంకును పది శాఖలకు విస్తరించడంతోపాటు ఆర్థిక శక్తి గల బ్యాంకుగా అభివృద్ధి చేశానని తెలిపారు. త్వరలోనే రాజకీయాలకతీతంగా బ్యాంకు సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తానన్నారు. నిబంధనల ప్రకారం మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది సంపత్‌రావు, కర్నె రవీందర్, మంద శ్రీనివాస్, కందిమళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
రూ.400 కోట్ల టర్నోవర్‌తో ముందుకు
రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు శాఖలు
విస్తరిస్తాం
వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు