
ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి
విద్యారణ్యపురి: విద్యార్థినులు ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించుకోవాలని, భవిష్యత్‌లో ఆర్థికస్వావలంబన సాధించే దిశగా చదువుకోవాలని వరంగల్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు గ్రహీత ఎన్.రవి అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ కెమికల్ అండ్ అలైడ్ సైన్సెస్ రీసెర్చ్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది ఈ సదస్సులోఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశలోనే లక్ష్యంతో ముందుకెళ్లాలని విద్యార్థినులకు సూచించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్ లలితాగురుప్రసాద్ కీలకపోన్యాసం చేస్తూ రసాయన శాస్త్ర అనుబంధ శాస్త్ర పరిశోధనల్లో ఆధునిక సాంకేతికత కృత్రిమ మేధా.. సాంకేతికతలో వస్తున్న ఆధునిక పోకడల విశిష్టతను తెలియజేస్తుందన్నారు. సదస్సులో ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి, కేయూ సైన్స్‌విభాగాల డీన్ జి. హనుమంతు, కెమిస్ట్రీ విభాగం అధిపతి ఎన్.వాసుదేవరెడ్డి, కేయూ కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్లు సి.హెచ్. సంజీవరెడ్డి, వడ్డె రవీందర్ మాట్లాడారు. ఈ సదస్సులో సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి. సుహాసిని, జాతీయ సదస్సు కన్వీనర్ ఎం.ప్రశాంతి, అధ్యాపకులు సురేశ్‌బాబు, ఉదయశ్రీ, బాలరాజు,జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈనెల 23న జాతీయసదస్సు ముగియనుంది.
అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రవి