
శ్రావణ ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రావణంలో చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని నగరంలోని ఆలయాల్లో సందడి నెలకొంది. వేయి స్తంభాల ఆలయంలో అర్చకుల ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్ దర్శించుకున్నారు. వారి వెంట తహసీల్దార్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లంబజార్‌లోని సాయిసేవాదళ్ భజన మందిరంలో సాయిబంధు మహిళా సభ్యులు అష్టలక్ష్మి ప్రతిమలకు గణపతిపూజ, అష్టలక్ష్మి పూజ, కుంకుమపూజలు నిర్వహించారు. వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారిని, శ్రీచక్రాన్ని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. హంటర్ రోడ్డులోని సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు
భద్రకాళి అమ్మవారు

శ్రావణ ప్రత్యేక పూజలు