
ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని రద్దు చేయాలి
హన్మకొండ అర్బన్: పోషణ్ ట్రాకర్ యాప్‌లో ఫేస్ క్యాప్చర్ (ఎఫ్‌ఆర్‌ఎస్) విధానాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఆన్‌లైన్ యాప్ విధానం ఉండేలా నిర్ణయించాలని అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు అంగన్వాడీలు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ విద్యా వలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని వీరికి అదనంగా చెల్లించాలన్నారు. అదనపు పనులు రద్దు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా నాయకులు నిడిగొండ రజిత, రమాదేవి, శోభారాణి, జమున, జోష్ణ, ప్రసన్న, రమాదేవి, రాజేశ్వరి, హైమావతి, శోభారాణి, వసంత, కిరీట, స్వరూపారాణి, ఉమాదేవి, బేబీ రాణి, శోభ, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీల ధర్నా