
బాలుర గురుకుల పాఠశాల, కళాశాల తనిఖీ
మడికొండ: మడికొండలోని సాంఘిక సాంక్షేమ బా లుర(వర్ధన్నపేట) పాఠశాల, కళాశాలను గురువా రం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తనిఖీ చే శారు. ఈ సందర్భంగా రికార్డులు, డైనింగ్ హాల్, పరిసరాలు పరిశీలించారు. డైలీ మెనూ ప్రకారం విద్యార్థులకు వంటకాలు అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మెనూ ప్రకారం విద్యార్ధులకు అందించాలని సూచించారు. జేఈఈ, నీట్ పరీక్షల ప్రిపేర్ అవుతున్న ఇంటర్ సెకండియర్ విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ దాసరి ఉమామహేశ్వరీ, ప్రిన్సిపాల్ కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.