
ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని కొట్టిపారేయలేం..
పర్యావరణంపై గంభీర సవాళ్లు..
కేయూ క్యాంపస్: ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని కొట్టిపారేయలేమని తిరువనంతపురం ఇస్పో ఎన్‌ఈఎస్‌ఎస్ ప్రొఫెసర్ ఎస్.వి.చలపతి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం ‘డైమండ్స్ ఫ్రమ్ థేర్ బర్త్‌టూ ఎటర్నిటీ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భూగోళశాస్త్రం ఎంతో గొప్పదన్నారు. కృత్రిమ డైమండ్స్‌పై మోజుపెరిగినా సహజసిద్ధ మైన డైమండ్ విలువైందన్నారు. భారతీయ డైమండ్ మార్కెట్ ప్రపంచంలో చాలాపెద్దదన్నారు.
ఇంజనీరింగ్ టెక్నాలజీలో
నూతన ఆలోచనలకు పదును..
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ సి. రాఘవేంద్రరావు అన్నారు. ‘సుర్రోగేట్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఫర్‌ఇంజనీరింగ్ స్పేస్‌టెక్నాలజీ’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అలాగే, ‘స్పేస్‌టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్’ అనే అంశంపై హైదరాబాద్‌లోని జీపీ బిర్లా సైంటిఫిక్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కె. మృత్యుంజయరెడ్డి.. స్పేస్ టెక్నాలజీలో వస్తున్న మార్పులను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
కలుపు నివారణలో సాంకేతికత..
కలుపునివారణలో సాంకేతికత ప్రధాన భూమికపోశిస్తుందని ఇక్రిశాట్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఎ. నారాయణరావు అన్నారు. ‘క్లెమేట్ రిసిలిఎంట్ ఇంటిగ్రేటెడ్ విత్ మేనేజ్‌మెంట్’అనే అంశంపై ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ కిశోర్‌నట్టి.. రసాయన, ఔషధ పరిశ్రమలో ఉపయోగించే ఉత్ప్రేరక సమ్మేళనాల ప్రభావ పాత్రను వివవరించారు. ముంబాయి బాబా అటమిక్ రీసెర్చ్‌సెంటర్ సైంటిస్ట్ డి. విద్యాసాగర్ మాట్లాడుతూ రేడియోలాజికల్ అత్యవసర పద్ధతులకు సిద్ధంగా ఉండాలన్నారు. బెంగుళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ తిరుపతి.. మానవశరీరంలోని సమీకరణాలు, ప్రవేశ విలువలు, షరతుల గురించి వివరించారు. కేన్సర్ నివారణపై రిటైర్డ్ ప్రొఫెసర్ రామ్‌బాహు వివరించారు.
ఆహార ఉత్పాదకతకు అత్యవసరమైన నత్రజని, భాస్వరం సమ్మేళనాలు వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వహణలో సరైన విధంగా ఉపయోగించుకోకపోవడంతో పర్యావరణానికి సవాళ్లు ఎదురవుతున్నాయని న్యూఢిల్లీ ఇంద్రప్రస్త యూనివర్సిటీ ప్రముఖ్ వైజ్ఞానిక్ ప్రొఫెసర్ నందుల రఘరాం అన్నారు. ‘పోషకవనరుల నిర్వహణ –పర్యావరణం’ అనేఅంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ పద్ధతులల్లో మార్పు తీసుకురావాలన్నారు.
కృత్రిమం కంటే సహజసిద్ధ డైమండ్ విలువైనది
తిరువనంతపురం ప్రొఫెసర్
ఎస్.వి. చలపతి

ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని కొట్టిపారేయలేం..

ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని కొట్టిపారేయలేం..