
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ విజయవంతం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవంలోకి అడుగిడిన వేళ తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ విజయవంతమైందని తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టాస్) అధ్యక్షుడు, హైదరాబాద్ సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సి.హెచ్. మోహన్‌రావు అన్నారు. మూడురోజులుగా యూనివర్సిటీలో ‘ఇన్నోవేటివ్ స్కిల్ ఫర్ ఎంపవర్‌మెంట్ సైన్స్‌అండ్ టెక్నాలజీ ఫర్ ట్రాన్సాఫార్మింగ్ ఇండియా’ అనే అంశంపై నిర్వహించిన తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్ గురువారం ముగిసింది. ఈ ముగింపు సభలో మోహన్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశాభివృద్ధిలో సైన్స్‌కీలకమన్నారు. ఈసభకు అధ్యక్షత వహించిన కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ,స్పేస్, క్వాంటం పరిశోధన అంశాలు విద్యార్థులు, పరిశోధకుల్లో ఆసక్తి రేకిత్తించాయన్నారు. తెలంగాణ అకాడమీ సైన్సెస్ జనరల్ సెక్రటరీ ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ శాస్త్రసాంకేతిక పురోగతే లక్ష్యంగా తెలంగాణ అకాడమి పనిచేస్తుందన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలన్నారు. తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ 48 ఆహ్వానిత లెక్చర్స్, ఐదు ప్లీనరీలెక్చర్లు, 164 ఓరల్ ప్రజెంటేషన్లు, పోస్టర్ ప్రజెంటేషన్లు కొనసాగాయన్నారు. మొత్తం 780 మంది పరిశోధకులు తమ పరిశోధన పత్రాలు సమర్పించారన్నారు. టాస్ ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, జాయింట్ సెక్రటరీ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, ట్రెజరర్ ఎస్‌ఎంరెడ్డి, వివిధ డీన్లు బి. సురేశ్‌లాల్, జి. హనుమంతు, గాదె సమ్మయ్య, సదానందం తదితరులు మాట్లాడారు. ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ప్రసాద్ వందన సమర్పణ చేశారు.
టాస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్‌రావు
ముగిసిన సైన్స్ కాంగ్రెస్

తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ విజయవంతం