
ఘనంగా ముగిసిన సందల్ ఉత్సవం
దర్గా వద్ద భక్తుల సందడి
కాజీపేట: దర్గా కాజీపేటలో గురువారం అర్ధరాత్రి హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబానీ రహమతుల్లా అలైహ్ ఉర్సు ఉత్సవాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేశ, విదేశాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తుల మధ్య ద ర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా ఆధ్వర్యంలో నిర్వహించిన సందల్ ఉత్సవం ఘనంగా ముగిసింది. మహిళలు రెండు రోజులపాటు శ్రమించి తయారు చేసిన మంచి గంధాన్ని వెండి పళ్లెంలోకి తీసుకుని ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రం కప్పి పురవీధుల్లో సందల్ ఊరేగింపు నిర్వహించారు. దేశంలోని 25 దర్గాలకు చెందిన పీఠాధిపతుల చేతుల మీదుగా దర్గాకు సందల్‌ను లేపనం చేయడంతో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఖుస్రూపాషా ప్రకటించారు. మూ డు రోజులపాటు సాగే ఈఉత్సవాల్లో వేలాది మంది భక్తులు బియాబాని దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు జరగకుండా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, సీఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ వెంకన్నతో పాటు సబ్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.