
అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్: ఐటీఐ/అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్‌ను హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈనెల 28 వరకు దరఖాస్తులకు చివరి తేదీ అని కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌లు వెంకటేశ్వర్లు, సక్రు, వేణు వెల్లడించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఐటీఐలో పలు కోర్సులకు అర్హులను పేర్కొన్నారు. ప్రతీ ఐటీసీలో వివిధ కోర్సుల్లో 172 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. డీఆర్డీఓ మేన శ్రీను, ఉపాధి శిక్షణ శాఖ ఆర్డీఓ సీతారాములు పాల్గొన్నారు.