
శివతత్వాన్ని తెలిపే అద్భుత శిల్పకళ
హన్మకొండ కల్చరల్: శివతత్వాన్ని తెలిపేలా కాకతీయులు అద్భుత శిల్పకళా ఖండాలు నిర్మించారని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు అన్నారు. బుధవారం వేయిస్తంభాల ఆలయాన్ని వీసీ దంపతులు సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారిని ఆలయమర్యాదలతో ఘనంగా స్వాగతించారు. వీసీ నిత్యానందరావు దంపతులు రుద్రేశ్వరస్వామికి బిల్వార్చన జరుపుకున్నారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో వరంగల్ జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ గంపా సతీశ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. అదేవిధంగా భద్రకాళి దేవాలయాన్ని వీసీ ఆచార్య నిత్యానందరావు దంపతులు సందర్శించగా.. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించుకున్నారు. వారికి అమ్మవారి శేషవస్త్రాలు అందజేశారు.
అభివృద్ధికి కృషి చేస్తా...
పరిశోధనల పరంగా జానపద గిరిజన విజ్ఞాన పీఠం అభివృద్ధికి కృషి చేస్తానని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆచార్య వెల్దండ నిత్యానందరావు అన్నారు. బుధవారం వరంగల్ హంటర్‌రోడ్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిప తి గడ్డం వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వీసీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు మాట్లాడుతూ.. విద్యార్థులకు కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తానన్నారు. ఈమేరకు పీఠంలో ఉసిరి మొక్క నాటారు. పీఠాధిపతి వెంకన్న వీసీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఠం సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు విశ్వవిద్యాలయం
వీసీ వెల్దండ నిత్యానందరావు
వేయిస్తంభాల ఆలయంలో
ప్రత్యేక పూజలు