
అక్రమ రవాణా కట్టడికే సాండ్‌బజార్
మడికొండ: ఇసుక అక్రమ రవాణా కట్టడికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాండ్‌బజార్ ఏర్పాటు చేశారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెప్పారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 64వ డివిజన్ ఉనికిచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సాండ్బజార్ను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. సాండ్ బజార్ల ద్వారా సరసమైన ధరకే ఇసుక లభిస్తుందన్నారు. ప్రజల అవసరాల మేరకు ఇసుకను డోర్ డెలివరీ చేస్తారని, మెట్రిక్ టన్నుకు రూ.1200లకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లభ్ధిదారులకు రూ.1,000లకు అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీజీఎండీసీ, ఎండీల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు అందుబాటులో నాణ్యమైన ఇసుక అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సాండ్బజార్లను ఏర్పాటు చేసినట్లు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఘన్పూర్ నియోజకవర్గంలో 80శాతం వరకు ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అందుబాటు ధరల్లో ఇసుక : కడియం శ్రీహరి