
మురుగు కేరాఫ్ పాత బీట్..
నగరంలో పాతబీట్ బజార్ వివిధ వ్యాపారాలకు ముఖ్యకేంద్రం. ఇక్కడ అన్ని రకాల వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయని నమ్మకం. అందుకే నగరంనుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ బజార్‌లోనే నిత్యావసరాలు, దుస్తులు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షంతో ఈ బజార్‌లోని రోడ్లు అధ్వానంగా మారాయి. వ్యాపారులు మిగిలిన సరుకులను రోడ్లపై, డ్రెయినేజీల్లో వేయడంతో మురిగిపోయి కంపుకొడుతున్నాయి. బల్దియా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్

మురుగు కేరాఫ్ పాత బీట్..

మురుగు కేరాఫ్ పాత బీట్..