బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైలు

Aug 19 2025 4:25 AM | Updated on Aug 19 2025 4:27 AM

వరంగల్‌ లీగల్‌: బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 15 వేల జరిమానా విధిస్తూ ఒకటో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అపర్ణాదేవి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా చిన్న గూడూరు మండలం బయ్యారం చిన్న తండాకు చెందిన ఓ మహిళ బతుకుదెరువు నిమిత్తం కాజీపేట డీజిల్‌ కాలనీ ప్రాంతానికి వచ్చి ఇక్కడే మొక్క జొన్న కంకులు కాల్చి విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈమెకు నలుగురు కూతుళ్లు ఉండగా ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. చిన్న కూతురు ఏడో తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటుంది. అప్పుడప్పుడు తల్లి వద్దకు వచ్చి పనులు చేస్తూ చేదోవాదోడుగా ఉండేది. ఈక్రమంలో పర్వతగిరి మండలం అన్నారం తండా చెందిన వాంకుడోత్‌ చంద్రుడు.. ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. 2022, డిసెంబర్‌ 15న రాత్రి ఫోన్‌ చేసి బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం సదరు బాలికను రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. ఈవిషయమై ఎవరికై నా చెబితే నీవు నాతో తీసుకున్న ఫొటోలు అందరికీ చూపిస్తానని భయపెట్టాడు. ఈ ఘటనపై బాలిక తల్లి కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ మహేందర్‌ రెడ్డి కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రస్తుత ఇన్‌స్పెక్టర్‌ వై.సుధాకర్‌రెడ్డి, కోర్టు కానిస్టేబుల్‌ ఏరుకొండ సుధాకర్‌, కోర్టు లైజన్‌ ఆఫీసర్‌, ఏఎస్సై పరమేశ్వరి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి అపర్ణాదేవి.. నేరస్తుడు వాంకుడోత్‌ చంద్రుడుకు 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు

కొత్తగట్టు సింగారం స్టేజీ వద్ద ఘటన

శాయంపేట : ఆగి ఉన్న లారీని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం మండలంలోని కొత్తగట్టు సింగారం స్టేజీ వద్ద చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, పోలీసుల కథనం ప్రకారం.. టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఎం.డి గౌసోద్దీన్‌ భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం శివారులో ఓ లారీని రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా నిలిపి ఉంచారు. ఇదే సమయంలో హనుమకొండ నుంచి కాళేశ్వరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి లారీని ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం దెబ్బతినడంతోపాటు ప్రయాణికులు రాజయ్య, సరోజన, వెంకటమ్మ, సౌజన్య, చంద్రయ్య, శశివరుణ్‌, ఎల్లమ్మ, పవిత్ర, ఉమారాణి, పోషక్క, అమూల్యకు స్వల్ప గాయాలు కావడంతో 108లో ఎంజీఎం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై జక్కుల పరమేశ్‌ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. అనంతరం బస్సు డ్రైవర్‌ గౌసోద్దీన్‌ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ అబ్దుల్‌ ఖాయమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులకు స్పల్ప గాయాలై పెనుప్రమాదం నుంచి తప్పించుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

ఖిలా వరంగల్‌: పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడి చేసి రూ.12 970 నగదు, 4 మొ బైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సార్ల రాజు తెలిపారు. వరంగల్‌ ఏనుమాముల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పేకాట ఆడుతున్న బొందుగుల అఖిల్‌, జడల సాగర్‌, నమిండ్ల కర్ణాకర్‌, ఇమ్మడి హర్షపై కేసు నమోదు చేసి తదుపరి చ ర్యల నిమిత్తం ఏ నుమాముల పో లీస్‌ స్టేషన్‌కు కేసు ను అప్పగించిన ట్లు ఇన్‌స్పెక్టర్‌ రా జు వివరించారు.

బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైల1
1/2

బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైల

బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైల2
2/2

బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement