
కొండపల్లిలో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేత
● అక్టోబర్ నుంచి అమల్లోకి..
కాజీపేట రూరల్ : ఫుట్ ఓవర్ బ్రిడ్జి మరమ్మతు కారణంగా కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అక్టోబర్ నుంచి కాజీపేట–విజయవాడ మధ్య గల కొండపల్లి రైల్వే స్టేషన్‌లో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు.
తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేసిన రైళ్లు ఇవే..
అక్టోబర్ 19 నుంచి నవంబర్ 11వ తేదీ వరకు మచిలీపట్నం–బీదర్ (12749) డైలీ ఎక్స్‌ప్రెస్, బీదర్–మచిలీపట్నం (12750) డైలీ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (17201) డైలీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు (17202) డైలీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 18 నుంచి నవంబర్ 17వ తేదీ వరకు తిరుపతి–ఆదిలాబాద్ (17405) డైలీ కృష్ణాఎక్స్‌ప్రెస్, ఆదిలాబాద్–తిరుపతి (17406) కృష్ణాఎక్స్‌ప్రెస్, అదేవిధంగా అక్టోబర్ 19 నుంచి నవంబర్ 18వ తేదీ వరకు విజయవాడ–భద్రాచలం(67215) ప్యాసింజర్, భద్రాచలం–విజయవాడ (67216) ప్యాసింజర్, విజయవాడ–డోర్నకల్ (67768) ప్యాసింజర్లకు కొండపల్లిలో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేసినట్లు సీపీఆర్వో ఎ. శ్రీధర్ తెలిపారు.