
వేగంగా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం
● కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
రామన్నపేట: ప్రజావాణి ఫిర్యాదుల్ని వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి ఆమె 81 దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా ఇంజనీరింగ్ నుంచి 15, హెల్త్ అండ్ శానిటేషన్ నుంచి 8, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ) నుంచి 13, టౌన్‌ప్లానింగ్‌లో 41, హార్టికల్చర్‌కు 2, నీటి సరఫరా కోసం 2 దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్ తెలిపారు.