
సైన్స్ కాంగ్రెస్‌ను విజయవంతం చేయాలి
● టెక్నికల్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ మల్లారెడ్డి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 19, 20, 21తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌ను విజయవంతం చేయాలని టెక్నికల్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ పి. మల్లారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం కేయూలోని సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ పరిశోధక విద్యార్థులతో ఫిజిక్స్ సెమినార్ హాల్‌లో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ సన్నాహక సమావేశం నిర్వహించగా మల్లారెడ్డి మాట్లాడారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి సైంటిస్టులు, ఆచార్యులు, స్కాలర్లు విచ్చేస్తున్నారని, వారంతా అనేక అంశాల మీద పరిశోధనలు చేసి ఈ సైన్స్‌కాంగ్రెస్‌లో పేపర్ల ప్రజెంటేషన్లు, పోస్టర్ల ప్రజెంటేషన్లు ఇవ్వబోతున్నారన్నారు. మీ సబ్జెక్టులలో నిష్ణాతులైన ప్రొఫెసర్ల నుంచి రీసెర్చ్ ఏవిధంగా చేయాలో నేర్చుకోవాలన్నారు. కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి, ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ఎన్. ప్రసాద్ పలు సూచనలు చేశారు. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి. వెంకట్రామ్‌రెడ్డి క్యాంపస్‌లోని వివిధ సెమినార్‌హాళ్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబోయే ఆడిటోరియం పరిసరాల్లో కొందరు స్కాలర్లు శనివారం శ్రమదానం నిర్వహించారు.
ఉడతా ఉడతా ఊచ్.. రూ.2లక్షల ఆస్తి ఊస్ట్..
రఘునాథపల్లి: ఉడతతో రూ.2లక్షల ఆస్తినష్టం జరిగిందంటే నమ్మశక్యంగా లేదుకదా.. కానీ వాస్తవం. అంతేకాదు.. పలు గ్రామాలకు నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని కెపాసిటర్ సెల్స్‌లోకి ఉడుత చేరడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు చెలరేగి ఉడుత మృతిచెందడంతో పాటు రెండు కెపాసిటర్ సెల్స్, కెపాసిటర్ ప్యానల్ బోర్డు, రెండు బ్యాటరీ చార్జర్లు, రెండు రిలేలు, 20 మీటర్ల బ్రేకర్స్ కేబుల్ కాలిపోయాయి. దీంతో సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకుని జనగామ నుంచి వచ్చిన ఎంఆర్‌టీ, టీఆర్‌ఈ బృందాలు దాదాపు మూడున్నర గంటలపాటు శ్రమించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఉడుత కెపాసిటర్ సెల్స్‌లోకి దూరడంతో రూ. 2 లక్షల మేర నష్టం జరిగినట్లు గుర్తించారు. అరె.. ఉడత ఎంత పనిచేశావ్ అంటూ గొణుక్కోవడం విద్యుత్ సిబ్బంది వంతైంది.

సైన్స్ కాంగ్రెస్‌ను విజయవంతం చేయాలి

సైన్స్ కాంగ్రెస్‌ను విజయవంతం చేయాలి