తెలంగాణ రైజింగ్–2047
సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా
కార్యాచరణ
● రైతుల సమస్యలు తీర్చేందుకు ‘భూభారతి’
● ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం
● రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ
హన్మకొండ అర్బన్ : తెలంగాణ సమగ్రాభివృద్ధి–2047 విజన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది.. అందులో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రా డెవలప్మెంట్, పారదర్శకత, సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యావరణ అటవీ, దేవాదా యశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా మహిళల అభ్యున్నతి, పర్యాటక అభివృద్ధి, నూతన ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారికత వంటి అంశాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. అనంతరం 25 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాల బంధువులను సత్కరించారు. పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ శకటాలను ప్రదర్శించారు. వైద్య ఆరోగ్య శకటానికి మొదటి బహుమతి లభించిందని డీఎంహెచ్ ఓ డాక్టర్ అప్పయ్య తెలిపారు.
ఆడబిడ్డలకు అండగా..
ప్రభుత్వం ఆడబిడ్డల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందులో భాగంగానే ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో జిల్లాలో ఇప్పటి వరకు 5.50 కోట్ల మంది ప్రయాణించి రూ.222.50 కోట్లు ఆదా చేశారని మంత్రి సురేఖ చెప్పారు. రూ.500లకే వంట గ్యాస్ ఇస్తున్నామని, అలాగే పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మొదటి దశలో 705, రెండో దశలో 5వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. రైతు రుణ విముక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 54,734 మందికి రూ.450 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం, సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామన్నారు. భూమి లేని పేదలకు రూ.12 వేలు ఆత్మీయ భరోసా అందజేస్తున్నామని, మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5,052 స్వయం సహాయక సంఘాలకు రూ.511 కోట్లు అందజేశామన్నారు. 8,446 సంఘాలకు రూ.18.33 కోట్లు వీఎల్‌ఆర్ ఇచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగ ల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
అమరవీరులకు మంత్రి నివాళి
రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరులకు మంత్రి సురేఖ నివాళులర్పించారు. హనుమకొండలోని తెలంగాణ అమరవీరు ల స్తూపం వద్ద మంత్రి సురేఖ, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ఆశ్విని తానాజి వాఖడే నివాళులర్పించారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి
కొండా సురేఖ, పక్కన కలెక్టర్ ప్రావీణ్య
తెలంగాణ రైజింగ్–2047
తెలంగాణ రైజింగ్–2047
తెలంగాణ రైజింగ్–2047


