సుందరీమణుల పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: ఈనెల 14న ప్రపంచంలోని వివిధ దేశాల సుందరీమణులు వరంగల్ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్లు, సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ షోబోట్ ప్రతినిధులు వివిధ దేశాల సుందరీమణులు సందర్శించే ప్రదేశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్లు మాట్లాడుతూ.. సుందరీమణులు హైదరాబాద్ నుంచి హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌కి చేరుకుంటారని, అక్కడ వారికి స్వాగతం, బతుకమ్మ ఆటాపాట కార్యక్రమం ఉంటుందన్నారు. వారి రాక సందర్భంగా పోలీస్ భద్రత పటిష్టంగా ఉండాలన్నారు. హరిత కాకతీయ నుంచి వేయి స్థంభాల దేవాలయానికి చేరుకుని దైవ దర్శనం చేసుకుంటారని తెలిపారు. అనంతరం ఫోర్ట్ వరంగల్‌ను సందర్శించనున్నట్లు, హరిత కాకతీయలో డిన్నర్ అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరుతారన్నారు. పర్యటన సమయాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఆలయ విశిష్టతను తెలియజేసేందుకు గైడ్ అందుబాటులో ఉండాలన్నారు. ఫొటో షూట్, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఏఎస్పీ మనన్ భట్, జిల్లా ఖజానా శాఖ అధికారి శ్రీనివాస్‌కుమార్, పర్యాటకశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలని ఏర్పాటు చేయాలి
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో జిల్లా కో–ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. కొత్తగా రెవెన్యూ మండలాల ప్రాతిపదికగా రైతు పరపతి సేవల కోసం ిపీఏసీఎస్‌లను ఏర్పాటు చేయాలన్నారు. కాజీపేట మండలం కాజీపేట దర్గా, హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌తోపాటు మరికొన్ని మండలాల్ల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, అధికారులు సంజీవరెడ్డి, చంద్రశేఖర్, రవీందర్ సింగ్, కొమరయ్య, నజీర్ సుల్తాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద
అధికారులతో సమన్వయ సమావేశం


