
సభ పేరుతో పంట పొలాలు ధ్వంసం
హసన్‌పర్తి/ఎల్కతుర్తి: బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభపేరుతో పంట పొలాలను ధ్వంస చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ధ్వజమెత్తారు. ఎల్కతుర్తిలో జరుగుతున్న రజతోత్సవ సభ పనులను మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ పేరుతో పంట కాల్వలు, వాగులను పూడ్చివేశారన్నారు. మండలాల సరిహద్దులు తొలగించారన్నారు. అనుమతిలేకుండా చెట్లను నరికివేసినట్లు ఆరోపించారు. ఇప్పటికీ బీఆర్‌ఎస్ అధికార పార్టీగా వ్యవహరిస్తోందన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పారిశ్రామికవేత్తలను భయబ్రాంతులకు గురిచేస్తూ విరాళాలు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు కాగా, రజతోత్సవ సభ పేరుతో బీఆర్‌ఎస్ నాయకులు మండలాల సరిహద్దులు తొలగించడమే కాకుండా కాల్వలు, వాగులను పూడ్చివేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు ఇంద్రాసేనారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్‌నర్సింహారెడ్డి, నాయకులు పోరెడ్డి మహేందర్‌రెడ్డి, తిరుపతి, వీసం సురేందర్‌రెడ్డి, రత్నాకర్‌రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు