
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మె నోటీస్
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
కేయూ క్యాంపస్: తమను రెగ్యులరైజ్ చేయాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ కాంట్రాక్టు ప్రొఫెసర్స్ కోఆర్డినేషన్ బాధ్యులు మంగళవారం కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డికి సమ్మెనోటీస్ అందజేశారు. తొలుత కొంతసేపు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేయూ కోఆర్డినేషన్ బాధ్యులు శ్రీధర్‌కుమార్‌లోథ్, నిరంజన్, సాధు రాజేశ్, మాదాసి కనకయ్య, జూల సత్య మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 యూని వర్సిటీల్లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈనెల 19 నుంచి సమ్మెకు వెళ్తున్నారని తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా తలపెట్టామని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోఆర్డినేషన్ బాధ్యులు బి. సతీశ్, సంకినేని వెంకట్, ఫిరోజ్‌పాషా, ఆశీర్వాదం, అరూరి సూర్యం, గడ్డం కృష్ణ, టి.నాగయ్య, రఘువర్ధన్‌రెడ్డి, వినీత, శ్రీదేవి, సునీత, సుచిరితపాల్, భాగ్య, ఉషాకిరణ్, వాణిశ్రీ, సదాశివ్, ప్రసాద్, వెంకటేశం, సాహితి, చందూలాల్, సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా, యూనివర్సిటీలో వివిధ పరిపాలన పదవులు నిర్వహిస్తున్న పలువురు కాంట్రాక్టు ప్రొఫెసర్లు తమ పదవులకు రాజీనామాలు చేసి అధికారులకు సమాచారం అందించారు.
న్యూస్‌రీల్

కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మె నోటీస్