
వెహికల్ ట్రాకింగ్ యాప్‌పై అవగాహన అవసరం
బల్దియా కమిషన్ చాహత్ బాజ్‌పాయ్
రామన్నపేట : వెహికల్ ట్రాకింగ్ అప్లికేషన్‌పై శాని టరీ ఇన్‌స్పెక్టర్‌లకు అవగాహన అవసరమని కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. సోమవారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల ఐసీసీసీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. వాహనాల ట్రాకింగ్ తీరును అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ వాహనాల స్థితిగతులను నమోదు చేసుకుని పూర్తినివేదికను తనకు అందజేయాలన్నారు. అదేవిధంగా హనుమకొండ బాలసముద్రంలోని వెహికల్ షెడ్డును తనిఖీ చేశారు. వెహికల్ షెడ్డు ప్రాంతంలో గుడిసెవాసులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కేటాయించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో శానిటేషన్ వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.