
ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపాలి
రామన్నపేట: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్.. అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రదాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ పాల్గొని నగరవాసులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆయా విభాగాల ఉన్నతాధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలన్నారు. ఎక్కువకాలం పెండింగ్‌లో ఉండకుండా చూడాలని, 24 గంటల వ్యవధిలోగా శానిటేషన్ విభాగానికి అందిన ఫిర్యాదులు పరిష్కారం కావాలని ఆదేశించారు. గార్బేజ్ బిన్‌లు లిఫ్ట్ చేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పన్నుల విభాగానికి సంబంఽధించిన స్వీకరించిన ఫిర్యాదులు వారంలోగా పరిష్కారం చూపాలన్నారు. ఈనెల 21 వరకు నగరంలో వివిధ ప్రాంతాల్లో బోనాలు పండుగలు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత ఆలయాల వద్ద ఎలకి్ట్రకల్ శానిటేషన్ ఏర్పాట్లతోపాటు డస్ట్, పారిశుద్ధ్యం నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణిలో ఇంజనీరింగ్ 23, టౌన్ ప్లానింట్ 44, హెల్త్ – శానిటేషన్ 11లతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన మొత్తం 91 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్‌చార్జి ఎస్‌ఈ, సిటీ ప్లానర్‌లు మహీందర్ రవీందర్ రాడేకర్, సీహెచ్‌ఓలు రమేష్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ స్తంభాలు తొలగించాలి
నగరంలోని 35వ డివిజన్ పుప్పాలగుట్టలోని ముత్యాలమ్మగుడి జంక్షన్‌లో రోడ్డుకు అడ్డంగా కరెంట్ పోల్స్ ఉండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు సోమవారం బల్దియా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌కి వినతి పత్రం అందజేశారు.
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్