
రికార్డులు, వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
ఎంజీఎం: హనుమకొండ జిల్లాలోని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు పీసీఅండ్‌పీఎన్‌డీటీ, ఎంటీపీ యాక్ట్ ప్రకారం విధిగా నిబంధనలు పాటించాలని, గర్భిణుల వివరాలు, రిఫర్ చేసిన డాక్టర్ వివరాలు రికార్డుల్లో రాయడంతోపాటు ఆన్‌లైన్‌లో కచ్చితంగా నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య సూచించారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలను అరికట్టేందుకు ప్రత్యేక బృందంతో బుధవారం ఆయన నగరంలోని పలు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, సర్టిఫికెట్లు, స్కానింగ్ మెషీన్‌లు, ఫామ్ – ఎఫ్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ.. వెయిటింగ్ హాల్, స్కాన్ రూమ్‌లో లింగ నిర్ధారణకు సంబంధించిన బోర్డును అందరికీ కనిపించేలా ప్రదర్శించాలన్నారు. స్కాన్ రిపోర్టులు, స్కాన్ ఇమేజ్‌లను 2 సంవత్సరాల పాటు భద్రపర్చాలన్నారు. సంతాన సాఫల్య కేంద్రాలు ఏఆర్టీ చట్టానికి లోబడి పని చేయాలన్నారు. ఎంటీపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే నిబంధనలకు లోబడి అబార్షన్స్ చేయాలని, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేకుండా అర్హత లేని డాక్టర్లు అబార్షన్లు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీఎంహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరి, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, ఐసీడీఎస్ సఖి వన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ హైమావతి, కమిషనరేట్ భరోసా సెంటర్ ఎస్సై బోయిన మంగ, సందీప్ పాల్గొన్నారు.
హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య