విద్యారణ్యపురి : ప్రత్యేక అవసరాల పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని డీఈఓ డి.వాసంతి కోరారు. సోమవారం హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో ఎంపిక చేసిన ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలను అందజేసి ఆమె మా ట్లాడారు. భారతీయ కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (అలీంకో) ఉపకరణాలను అందజేసిందని తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్లలను భవిత కేంద్రంలో చేర్చి సమీపంలోని పాఠశాలల్లో వారి స్థాయికి తగిన తరగతిలో చేర్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా వారికి వీల్‌చైర్లు, రోలెటర్స్, క్రష్ ఎల్‌బో అడ్జస్ట్ మెంటు, హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిలీ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో సమ్మిళిత విద్య సమన్వయకర్త బద్దం సుదర్శన్‌రెడ్డి, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ సునీత, ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, ఎంఈఓ నెహ్రూ, ప్రత్యేక అవసరాల పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.