ఆకట్టుకున్న ఫ్లాష్‌ మాబ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ఫ్లాష్‌ మాబ్‌

Mar 17 2025 10:24 AM | Updated on Mar 17 2025 10:25 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని కో–ఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ డేని పురస్కరించుకొని ఆదివారం ప్లాష్‌ మాబ్‌, ట్రెడిషనల్‌ డేను నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించారు. కళాశాల ఆవరణలో సంప్రదాయ వంటకా లు తయారు చేసుకుని తోటి విద్యార్థులకు పంచి పెడుతూ సందడి చేశారు. విద్యార్థులు మెహందీ డిజైన్లు వేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఫొటోఫ్రేమ్‌లు సుందరంగా తయారు చేశారు. ఫొటోలను విభిన్న రూపాల్లో ఆకర్షణీయంగా సృష్టించారు. కళాశాల ఆవరణలో ఫ్లాష్‌మాబ్‌తో అదరగొట్టారు.

నేడు ఇంజినీరింగ్‌ కళాశాల వార్షికోత్సవం

కాకతీయ యూనివర్సిటీ కో–ఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వార్షికోత్సవాన్ని ఈనెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్‌డే అండ్‌ కల్చరల్‌ డేను కూడా నిర్వహించనున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.రమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement