కాజీపేట, వరంగల్‌ మీదుగా 50 వీక్లీ రైళ్లు | - | Sakshi
Sakshi News home page

కాజీపేట, వరంగల్‌ మీదుగా 50 వీక్లీ రైళ్లు

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

కాజీపేట రూరల్‌ : కాజీపేట జంక్షన్‌, వరంగల్‌ మీ దుగా ప్రయాణించే వివిధ వారాంతపు రైళ్లను అక్టోబర్‌ 3వ తేదీ నుంచి పొడిగించి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ గురువారం తెలి పారు. కాజీపేట మీదుగా చర్లపల్లి–షాలిమార్‌–చర్లపల్లి 18 వీక్లీ రైళ్లను, వరంగల్‌ మీదుగా జోద్‌పూర్‌–చైన్నె బీచ్‌, చైన్నె సెంట్రల్‌–జోద్‌పూర్‌ 18 రైళ్లను, కాన్పూర్‌–ఎస్‌ఎంవీటీ బెంగళూర్‌–కాన్పూర్‌ 14 వీ క్లీ రైళ్లను పొడిగించి నడిపిస్తున్నట్లు తెలిపారు.

కాజీపేట మీదుగా వెళ్లే వీక్లీ రైళ్లు..

అక్టోబర్‌ 3వ తేదీ నుంచి నవంబర్‌ 28వ తేదీ వరకు చర్లపల్లి–షాలిమార్‌ (08046) 9 వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రతీ శనివారం చర్లపల్లిలో బయలుదేరి కాజీపేటకు చేరుకుని వెళ్తాయి. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి నవంబర్‌ 27వ తేదీ వరకు షాలిమార్‌–చర్లపల్లి (08045) 9 వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రతీ శుక్రవారం షాలిమార్‌లో బయలుదేరి మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తాయి. ఈ రైళ్లకు కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, రాయన్‌పాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్‌, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస, బరంపూర్‌, కుర్ధారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, జాజ్‌పూర్‌, కిన్జుహర్‌ రోడ్‌, భద్రక్‌, బాలసోర్‌, ఖరగ్‌పూర్‌, సంత్రగచ్చిలో హాల్టింగ్‌ కల్పించారు.

వరంగల్‌ మీదుగా వెళ్లే వీక్లీ రైళ్లు..

అక్టోబర్‌ 11 నుంచి నవంబర్‌ 29వ తేదీ వరకు జోద్‌పూర్‌–చైన్నె బీచ్‌ (04815) 9 వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రతీ శనివారం జోద్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుని వెళ్తాయి. అక్టోబర్‌ 6వ తేదీ నుంచి చైన్నె సెంట్రల్‌–జోద్‌పూర్‌ (04816) 9 వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు ప్రతీ మంగళవారం చైన్నెలో బయలుదేరి మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుని వెళ్తాయి. ఈ రైళ్లకు మేటరోడ్‌, దేగ్‌నా, మక్రానా, కుచమాన్‌ సిటీ, పెలేరా, జైపూర్‌, దుర్గాపూర్‌, సవాయ్‌మదోపూర్‌, సొగరియా, బరోన్‌, చాబ్రాగుగర్‌, రుతియాయ్‌, గుణబిణ, భోపాల్‌, ఇటార్సీ, నాగ్‌పూర్‌, బల్లార్షా, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, మంచిర్యాల, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేటలో హాల్టింగ్‌ కల్పించారు.

అక్టోబర్‌ 4వ తేదీ నుంచి నవంబర్‌ 15వ తేదీ వరకు కాన్పుర్‌ సెంట్రల్‌–ఎస్‌ఎంవీటీ బెంగళూరు (04131) 7 వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు ప్రతీ ఆదివారం కాన్పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు వరంగల్‌కు చేరుకొని వెళ్తాయి. అక్టోబర్‌ 7వ తేదీ నుంచి నవంబర్‌ 18వ తేదీ వరకు ఎస్‌ఎంవీటీ బెంగళూరు–కాన్పూర్‌ సెంట్రల్‌ (04132) 7 వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు ప్రతీ బుధవారం బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు వరంగల్‌కు చేరుకుని వెళ్తాయి. ఈ రైళ్లకు ఫత్తేపూర్‌, ప్రయాగ్‌రాజ్‌, శంకర్‌ఘర్‌, దాబురా, మాణిక్‌పూర్‌, సంత, కట్నీ, మదనమహాల్‌, ఇటార్సీ, నాగ్‌పూర్‌, బల్లార్షా, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కట్‌పాడి, జోలర్‌పేట్టయ్‌,బంగార పేట్‌, కృష్ణార్జునాపురంలో హాల్టింగ్‌ కల్పించారు.

వరంగల్‌ మీదుగా 32..

కాజీపేట మీదుగా 18..

అక్టోబర్‌, నవంబర్‌లో అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement