హన్మకొండ: ఇటీవల అగ్నిప్రమాదంలో మృతి చెందిన లింగాల కేదారి దంపతుల కుటుంబాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే నాయిని కోరిక మేరకు మంత్రి పొంగులేటి.. లింగాల కేదారి కుటుంబాన్ని పరామర్శించారు. ఉద్యమ కాలంలో కేదారి అందించిన సేవలను ఎమ్మెల్యే నాయిని.. మంత్రికి వివరించి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని కోరారు. స్పందించిన మంత్రి.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు.
20న ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు స్క్రీనింగ్ టెస్ట్
హసన్‌పర్తి: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల కోసం ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్ట్‌కు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్ సహకారంతో పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వ రంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు httpscœ/form,gle/eD2e5jNfebo5prg8 వెబ్‌సైట్‌లోవివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆదివారం (ఈనె20న) ఉద యం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్న ట్లు చెప్పారు. వరంగల్‌లోని సీకేఎం కళాశాల, హనుమకొండలోని ఎస్‌వీఎస్ కళాశాల, జనగామలోని సీజేఐటీ ఇంజనీరింగ్ కళాశాల, పరకాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నర్సంపేటలోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
‘భద్రకాళి’ ఆదాయం రూ.72 లక్షలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 76 రోజులకు రూ.72,30,387 ఆదాయం లభించిందని వరంగల్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. 628 యూఎస్‌ఏ డాలర్లు, 5 కెనడా డాలర్లు, 110 యూఏఈ దిరమ్స్, 10 బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ పౌండ్స్, 60 బ్యాంక్ ఆఫ్ అరేబియా మానిటరీ అథారిటీ, 10 యూరోలు లభించాయని తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో వరంగల్ జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ పరిశీలకురాలు ఎన్.కవిత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ఆలయ సిబ్బంది, శ్రీలక్ష్మీ శ్రీనివాస సేవాట్రస్ట్ జి.కృష్ణారెడ్డి, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సేవాసమితి జి.నవీన్, 200 మంది సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.


