నిప్పంటించుకున్న యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

నిప్పంటించుకున్న యువకుడి మృతి

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

ఖిలా వరంగల్‌ : కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటిచుకున్న ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. వరంగల్‌ కరీమాబాద్‌లోని లక్ష్మీనగర్‌కు చెందిన కట్ల హరీశ్‌(27) అదే ప్రాంతానికి చెందిన వైష్ణవిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు చోటుచేసుకోవడంతో దూరంగా ఉంటున్నారు. ఈనెల 10న హరీశ్‌పై అతడి భార్య మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 11న హరీశ్‌కు స్టేషన్‌కు వెళ్లాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, కొడుకు దూరమవుతున్నాడని మనస్తాపానికి లోనై హరీశ్‌ పెట్రోల్‌ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకొని స్టేషన్‌లోకి పరుగులుతీశాడు. గాయాలైన అతడిని ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తల్లి రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కర్రె స్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement