నిట్‌లో మ్యూజికల్‌ నైట్‌ | Sakshi
Sakshi News home page

నిట్‌లో మ్యూజికల్‌ నైట్‌

Published Sat, Nov 18 2023 1:18 AM

- - Sakshi

కాజీపేట అర్బన్‌ : నిట్‌లో శుక్రవారం నిర్వహించిన క్లాసికల్‌ మ్యూజికల్‌ నైట్‌ అలరించింది. ప్రతి ఏడాది నిట్‌ స్పిక్‌ మేకే (సొసైటీ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌ అండ్‌ కల్చర్‌ అమంగ్‌ యూత్‌) టీం క్లాసికల్‌ మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా గ్రామీ అవార్డు గ్రహీత, ఫ్లూట్‌ ప్లేయర్‌ పండిట్‌ అజయ్‌ప్రసన్న, తబలా ప్లేయర్‌ అభిషేక్‌ మిశ్రా శాసీ్త్రయ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో నిట్‌ డీన్లు త్యాగేష్‌ చంద్రన్‌, శ్రీనివాసాచార్య పాల్గొన్నారు.

న్యాయసేవాధికార సంస్థ

కార్యదర్శి బదిలీ

వరంగల్‌ లీగల్‌ : వరంగల్‌ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి జె. ఉపేందర్‌రావును హనుమకొండ మొదటి సబ్‌కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేశారు. నర్సంపేట సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.సాయికుమార్‌ను వరంగల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేస్తూ, వరంగల్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పెండింగ్‌ బిల్లులు,

డీఏలు చెల్లించాలి

విద్యారణ్యపురి : ఈసీ అనుమతితో ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులు, డీఏలను వెంటనే చెల్లించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందంగౌడ్‌ డిమాండ్‌ చేశారు. హనుమకొండలోని ఎస్‌టీయూ భవనంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల అనంతరం ఐఆర్‌ పెంపు, మెరుగైన పీఆర్సీ ఫిట్‌మెంట్‌ కోసం ఎస్‌టీయూ పోరాటం చేస్తుందన్నారు. అనంతరం ఎస్‌టీయూ హనుమకొండ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కామగోని రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేమునూరి రాంబాబు, రాష్ట్ర కౌన్సిలర్లుగా భీమనాథుని రవి, రూపిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సాంబయ్య, సూరి రమేష్‌, ఆర్థిక క్యార్యదర్శిగా మేడిపల్లి విద్యాసాగర్‌, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడిగా మాలోత్‌ గణపతి, రాజన్న, వీరప్రతాప్‌, జిల్లా ఉపాధ్యక్షులుగా జి.రవీందర్‌, వి.పరమేశ్వర్‌, జి.సుమన్‌, రాణి, ఎం.జయసుధ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రమేష్‌ వ్యవహరించారు. సమావేశంలో ఎస్‌టీయూ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఆట సదయ్య, భూపాలపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

19న యువ ఓటర్లకు

క్రికెట్‌ మ్యాచ్‌

హన్మకొండ అర్బన్‌/హన్మకొండ : స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా ఈనెల 19న నగరంలోని జవహర్‌ లాల్‌ నెహ్రు స్టేడియంలో యువ ఓటర్లకు క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించన్నుట్లు ట్రైనీ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అఽధికారులతో కలిసి మ్యాచ్‌ ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వరంగల్‌, హనుమకొండ జిల్లాల యువ ఓటర్లు, అధికారులతో ఈ పోటీలు నిర్వహించన్నుట్లు తెలిపారు. ఉత్సాహవంతులైన యువ ఓటర్లు పాల్గొని క్రికెట్‌ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో జీఎం ఇండస్ట్రీస్‌ హరిప్రసాద్‌, డీపీఓ జగదీశ్‌, స్పోర్ట్స్‌ అధికారి అశోక్‌ పాల్గొన్నారు.

అమిత్‌షా సభలకు

సర్వం సిద్ధం

నేడు వరంగల్‌,

20న జనగామకు రాక

బహిరంగ సభల్లో ప్రసంగించనున్న

కేంద్ర హోంమంత్రి

– 12లోu

1/2

2/2

Advertisement
 
Advertisement