తాడికొండ: రైల్వేలైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ట్రంక్ రోడ్లకు మాత్రమే తాము భూములిస్తామని, వీటికంటే అదనంగా ప్రభుత్వం సమీకరణకు అడిగితే ఒక్క ఎకరం కూడా భూమి ఇవ్వమని కంతేరు గ్రామ రైతులు సీఆర్డీఏ అధికారులకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంతేరు గ్రామంలో నుంచి రైల్వేలైన్‌కు 31 ఎకరాలు, రింగ్ రోడ్డు, ట్రంక్ రోడ్లకు 94 ఎకరాలు భూమి మాత్రమే వెళుతుందని, దీనికి మాత్రమే తాము భూములిస్తామని తెలిపారు. ప్రభుత్వం నోటిఫికేషన్ నెంబర్ 166/2026, ఎల్పీఎస్ 07–10–2026 ప్రకారం మొత్తం తమ గ్రామంలో 974 ఎకరాలు సమీకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చిందని కానీ తాము దీనికి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం –2014, సెక్షన్ 55(4) ద్వారా రైతులందరూ అభ్యంతరాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ విషయమై గతంలో నిర్వహించిన గ్రామ సభల్లో సీఆర్డీఏ అధికారుల సమక్షంలో తెలియజేశామన్నారు. జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో కూడా అర్జీ ఇచ్చిన అనంతరం ఆ ప్రతిని ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ విభాగం, సీఆర్డీఏ కమిషనర్, తహసీల్దార్, కంతేరు గ్రామ కార్యదర్శి, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌కు అందజేయడం జరిగిందన్నారు. కాబట్టి అదనపు భూ సమీకరణ చేయవద్దని కోరారు. అవసరాల మేరకు భూములిచ్చిన రైతులకు తమ పక్కన గతంలో సమీకరణ చేసిన నిడమర్రు గ్రామంలో ప్లాట్లు కేటాయించమని కోరారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కు ‘విట్’ రూ.కోటి విరాళం
తాడికొండ: ముఖ్యమంత్రి సహాయ నిధికి వీఐటీ (విట్) చాన్స్‌లర్ విశ్వనాథన్ రూ.కోటి ఆర్థిక సాయం అందజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం నగదు డీడీని అందజేసి, తుఫాన్ బాధితులకు తనవంతు సాయంగా తెలిపారు. ఆయన వెంట వీఐటీ ఏపీ వైస్–ప్రెసిడెంట్ డాక్టర్ శంకర్ విశ్వనాథన్, డాక్టర్ శేఖర్ విశ్వనాథన్, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర ముదిగంటి తదితరులు ఉన్నారు.


