కూరల్లేక.. అన్నం తినలేక..! | - | Sakshi
Sakshi News home page

కూరల్లేక.. అన్నం తినలేక..!

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలంలో ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి ఆకలి కేకలు తప్పలేదు. చాలీ చాలని భోజనాలు సమకూర్చడంతో సగం మంది ఉద్యోగులు ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ముందుగా నిర్దేశిత మెనూ ప్రకారం భోజనాలను సమకూర్చారు. అయితే అవన్నీ అరకొరగా ఉండటంతో కొద్దిమందికే సరిపోయాయి. మిగిలిన వారికి కూరలేమీ లేకుండా ఉత్త బిర్యానీ రైస్‌ మాత్రమే వడ్డించడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్త బిర్యానీ రైస్‌తో ఎలా తినాలంటూ.. మండిపడటంతో కర్డ్‌రైస్‌లోకి తెచ్చిన నిమ్మకాయ చట్నీని బిర్యాలోనికి వడ్డించారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన పీవో, ఓపీవోలు ఇదెక్కడి దారుణం..భోజనాలు పెట్టే విధానం ఇదేనా అని అసహనం వ్యక్తం చేశారు. విషయం రిటర్నింగ్‌ అధికారి ప్రసాద్‌ దృష్టికి వెళ్లడంతో స్పందించిన ఆయన సంబంధిత అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు నుంచీ చెబుతున్నా ఇంత నిర్లక్ష్యం ఏమిటంటూ మండిపడ్డారు. వెంటనే స్థానికంగా భోజనం తయారు చేయించి సిబ్బందికి అందించారు. అయితే అప్పటికే చాలా మంది బయటకు వెళ్లి తినేసి రావడంతో పాటు మరికొందరు పోలీసులు తెచ్చుకున్న భోజనాలు తిని సరిపెట్టుకున్నారు.

ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులకు

తప్పని మెతుకులాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement