పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

తెనాలి: అర్నబ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో వరి పంట నేలవాలిన తెనాలి మండలంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ గురువారం పర్యటించారు. తెనాలి–విజయవాడ రోడ్డులోని సోమసుందరపాలెం, కంచరపాలెం గ్రామాల్లో రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం నేరుగా పొలాల్లోకి దిగి పంటల పరిస్థితిని పరిశీలించారు. వరిపైరు నేల వాలిందని, కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగి పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ వెంటనే వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు. నిల్వ ఉన్న నీటిని తక్షణమే బయటకు పంపించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. వ్యవసాయ ముఖ్య శాస్త్రవేత్తలు డాక్టర్‌ సీహెచ్‌ సుజాని రావు, డాక్టర్‌ ఎం. రత్నం, డాక్టర్‌ ఎన్‌. సాంబశివరావు రైతులకు సూచనలు అందజేశారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, తెనాలి రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె. శ్రీరమణి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం. పద్మావతి, తహసీల్దార్‌ కేవీ గోపాలకృష్ణ పాల్గొన్నారు.

స్ట్రాంగ్‌ రూముల తనిఖీ

తెనాలిలో స్ట్రాంగ్‌ రూములు, పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సీఎం సాయికాంత్‌ వర్మ గురువారం తనిఖీ చేశారు. తెనాలి మున్సిపాలిటీలో ఎన్నికల సామగ్రి స్వీకరణ, స్ట్రాంగ్‌ రూములు, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను స్థానిక వీఎస్సార్‌ కాలేజీలో చేపడుతున్న విషయం తెలిసిందే. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి స్ట్రాంగ్‌ రూములు, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సైతం ఇదే కాలేజీలో చేస్తున్నారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు హాళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీడియా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

నీట మునిగిన వరి పొలంలోకి

దిగిన జిల్లా కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement