కూటమి ఓటమికి రె‘బెల్స్‌’ | - | Sakshi
Sakshi News home page

కూటమి ఓటమికి రె‘బెల్స్‌’

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

కూటమి ఓటమికి రె‘బెల్స్‌’ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి పట్నంబజారు: కూటమికి ఓటమి భయం పట్టుకుంది. ఏళ్ల తరబడి టీడీపీ జెండాను పట్టుకున్న కార్యకర్తలను నిలువునా మోసం చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. మిత్రధర్మాన్ని పాటించకుండా జనసేన, బీజేపీలకు మొండిచేయి చూపించిన నేపథ్యంలో ఆయా పార్టీల నేతలే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలోకి దిగారు. తమకు జరిగిన అన్యాయానికి కూటమిపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ క్రమంలో గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికలు ఎంతో హాట్‌గా మారాయి. కూటమి ఓటమికి రె‘బెల్స్‌’ మోగుతున్నాయి. ఇప్పటికీ సరైన పద్ధతిలో కూటమి ప్రజాప్రతినిధులు వ్యవహరించకపోవడం, పార్టీ నేతలను సస్పెండ్‌ చేస్తూ భయపెట్టే ఆలోచనలకు దిగడంతో వ్యతిరేకత పెరుగుతోంది. కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ నవంబరు ఒకటో తేదీన జరగనుంది. వైఎస్సార్‌ సీపీ నేతలు సమతుల్యతను పాటిస్తూ, జెండా పట్టుకుని పాటుపడిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం కల్పించే దిశగా అడుగులు ముందుకు వేశారు. ఆయా ప్రాంతాల్లో కష్టపడి పనిచేసే వారికి పెద్దపీట వేశారు. గుంటూరు ఈస్ట్‌, వెస్ట్‌లో ఎమ్మెల్యేలు నసీర్‌ అహ్మద్‌, గల్లా మాధవిలు కేవలం డబ్బులనే ప్రామాణికంగా తీసుకుని సీట్లు కేటాయించిన పరిస్థితులు ఉన్నాయని కూటమి కేడర్‌ బహిరంగంగానే చెబుతోంది. అసలు కూటమిలో ఎవరికి సీటు కేటాయించారో కూడా అర్థం కాని పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో తమకు అవకాశం దొరకకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసిన ఎంతోమంది కూటమి అభ్యర్థులు ‘ఫ్రెండ్లీ కాంపిటేషన్‌’ పేరుతో ముందుకు వచ్చారు. నగరంలో మొత్తం 76 డివిజన్లు ఉండగా, క్షేత్రస్థాయిలో సీట్లు సర్దుబాటు కాకపోవడంతో అధిక సంఖ్యలో కూటమి నుంచి రెబల్స్‌గా పోటీకి దిగుతున్నారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు రెబల్స్‌ పోటీ మింగుడుపడని అంశంగా మారింది. ● 10వ డివిజన్‌లో జనసేన తరఫున చామర్తి ఆనంద్‌సాగర్‌ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి శనక్కాయాల ఉమాశంకర్‌ బరిలో దిగారు. ● 13వ డివిజన్‌ నుంచి టీడీపీ తరఫున గాలి సతీష్‌బాబు పోటీ చేస్తుండగా, జనసేన అభ్యర్థిగా కూరాకుల పెదశ్రీనివాసరావు తలపడుతున్నారు. ● 22వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థిగా మల్లాల లక్ష్మీనారాయణ పోటీ చేస్తుండగా, జనసేన నుంచి సంకూరి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ● 24వ డివిజన్‌లో బీజేపీ తరఫున కావటి ఉదయచంద్ర విక్రమ్‌నాయుడు, జనసేన తరఫున నిమ్మల వెంకటరమణ పోటీ చేస్తున్నారు. ● 39వ డివిజన్‌లో జనసేన నుంచి పసుపులేటి నరసింహారావు, బీజేపీ నుంచి బాదం శ్రీనివాసరావు తలపడుతున్నారు. ● వీటితోపాటు 49వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా బలిజ సుగుణాదేవి, జనసేన అభ్యర్థిగా బండ్రెడ్డి విద్యావతి, 63వ డివిజన్‌లో టీడీపీ నుంచి బేతం శౌరీ, జనసేన తరఫున కొర్రపాటి నాగేశ్వరరావు పోటీకి దిగారు. ● 7వ డివిజన్‌లో ఖుద్దూస్‌ కూడా టీడీపీ సీటు ఆశించి భంగపడి రెబల్‌గా పోటీ చేస్తున్నారు. దాదాపు అన్ని డివిజన్లలో టీడీపీ, జనసేన, బీజేపీ రెబల్‌ అభ్యర్థులు పలు గుర్తులతో పోటీకి దిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 133 మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఉంటే, వారిలో సుమారు 80 నుంచి 90 మంది వరకు కూటమిలో సమన్వయం లేక నామినేషన్లు దాఖలు చేసినవారేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితులను చూసిన టీడీపీ అధిష్ఠానం అభ్యర్థులను సస్పెండ్‌ చేస్తామని బెదిరింపులకు దిగుతోంది. ఇప్పటికే 2వ డివిజన్‌లో టీడీపీ సీటు ఆశించి భంగపడటంతో పోటీ చేస్తున్న బేళ్ల వెంకటేశ్వరరావు యాదవ్‌ 40 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ముందుకు సాగారు. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ తీరని ద్రోహం చేశారని ఆరోపిస్తూ పొన్నూరు రోడ్డులోని ఆయన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో బేళ్ల వెంకటేశ్వరరావు యాదవ్‌ను ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. మరికొంతమందిని ఇప్పటికే సస్పెండ్‌ చేసిన టీడీపీ అధిష్ఠానం,... కూటమి నేతలను సస్పెన్షన్ల పేరుతో భయాందోళనలకు గురి చేస్తోంది. దీంతో విసిగిపోయిన తెలుగు తమ్ముళ్లు, జనసేన నేతలు పూర్తిస్థాయిలో కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. కూటమిలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు, చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న పూర్తిస్థాయి వ్యతిరేకతకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్‌ భద్రత మద్యం, నగదు పంపిణీపై ప్రత్యేక నిఘాకు ఆదేశాలు

అందులో 80 మందికిపైగా

టీడీపీ, జనసేన, బీజేపీ రెబల్స్‌

అయోమయ పరిస్థితుల్లో

తెలుగు తమ్ముళ్లు

సస్పెండ్‌ బాట పట్టిన టీడీపీ అధిష్టానం

నగరంపాలెం: జిల్లాలో వచ్చేనెల ఒకటిన జరగనున్న ఎన్నికలు దృష్ట్యా ముందస్తుగా పోలీస్‌ భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ స్పష్టం చేశారు. గురువారం నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి సెల్‌ కాన్ఫరెన్‌న్స్‌ ద్వారా పోలీస్‌ అధికారులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించాలని అన్నారు. చట్ట ప్రకారం వారిపై బైండోవర్‌ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల పోలింగ్‌కు ఆటంకం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉండాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో, ఓటర్ల క్యూలైన్లల్లో ఎన్నికల ప్రచారం చేయకుండా పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ గుర్తుల్లేని ఓటర్‌ స్లిప్‌లు పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో పంపిణీ చేయాలని అన్నారు. ఎన్నికలకు 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూసివేయాలని చెప్పారు. మద్యం అక్రమ నిల్వలు, విక్రయాలు, పంపిణీపై ప్రత్యేక నిఘా వేయాలని అన్నారు. ఈనెల 31 నుంచి మొబైల్‌ పార్టీలు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ నిరంతరం పర్యటించాలని అన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, రౌడీషీటర్లను ఎన్నికల ఏజెంట్లుగా నియమించవద్దని సూచించారు. సున్నిత, అత్యంత సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలలో అదనపు భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి పోలీస్‌ సిబ్బంది వద్ద లాఠీ, విజిల్‌ ఉండాలని చెప్పారు. ప్రతి పోలీస్‌ అధికారి, సిబ్బంది సమర్థ్‌ యాప్‌ను డౌన్‌న్‌ లోడ్‌ చేసుకోవాలని అన్నారు. ప్రజలు ఎటువంటి భయాలు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికావద్దని అన్నారు. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు.

ఆర్థికబలమే ప్రామాణికం

జాబితా పెద్దదే...

సస్పెన్షన్‌ బాట

గుంటూరు నగరంలో

133 మంది స్వతంత్ర అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement