తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండలం కుంచనపల్లి సమీపంలోని అరవింద పాఠశాలలో గురువారం ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్–17 బాలబాలికల రగ్బీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. సెలక్షన్స్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి సుమారు 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ ఇంద్రాణి పోటీలను ప్రారంభించారు. వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించగా, వారి ఆటతీరు ఆధారంగా జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు దసరా సెలవుల్లో కాకినాడలో జరుగనున్న రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా తరుపున ప్రాతినిధ్యం వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వడ్డేశ్వరం పాఠశాల హెచ్‌ఎం ఎం.ఉమాశ్రీ, తెలుగుయువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, మాజీ సర్పంచ్ షేక్ చినరంగ షరీఫ్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకుమాను జోజప్ప, గుంటూరు జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీ సీహెచ్.వినయ్ కుమార్, పీడీలు మెల్లెంపూడి రవి, నూతక్కి రవి, డి.భాస్కరరావు, సీహెచ్.కొండయ్య, నాగమణి, మాదురి రాణి, హరికృష్ణ, ప్రతాప్‌రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.


