కొసరు నిధులకూ ఎసరు | - | Sakshi
Sakshi News home page

కొసరు నిధులకూ ఎసరు

Sep 26 2026 2:02 AM | Updated on Sep 26 2026 2:02 AM

గ్రామాల సొమ్ముతో రాష్ట్రస్థాయి ఖర్చులా?

గ్రామ పంచాయతీల

సొంత ఆదాయంపై టీడీపీ సర్కారు కన్ను

ఓఎస్‌ఆర్‌లో ఒక్క శాతం నిధులు

చెల్లించాలంటూ జీవో జారీ

ఈ–గవర్నెన్స్‌, స్వర్ణ పంచాయతీ పోర్టల్‌, ఐటీ కార్యకలాపాల కోసం అంటూ ఒత్తిడి

కొత్త నిధులివ్వకపోగా సొంత నిధులు మళ్లింపు

టాప్‌ ప్రాధాన్యంలో తీర్మానాలు చేయాలంటూ కార్యదర్శులపై ఒత్తిడి

టీడీపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు

ప్రాధాన్యం అంటూ..

వసూలు చేసిన మొత్తాన్ని ఇలా ఉపయోగిస్తారు

ఈ–గవర్నెన్స్‌ అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్‌ ఏర్పాటు, బలోపేతం

ఈ–గవర్నెన్స్‌ టెక్నికల్‌ యూనిట్‌

స్వర్ణ పంచాయతీ వెబ్‌ పోర్టల్‌ నిర్వహణ, అభివృద్ధి

డిజిటల్‌ సేవలు, పౌర కేంద్రిత అప్లికేషన్లు

ఐటీ మౌలిక సదుపాయాలు

పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ కమిషనర్‌ ఆమోదించిన ఇతర ఐటీ కార్యక్రమాలు

కార్యదర్శులపై ఒత్తిడి..

ప్రత్తిపాడు: పంచాయతీలకు ఎగనామం పెట్టేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమయ్యింది. వాటికి సమృద్ధిగా నిధులు ఇవ్వవలసిన సర్కారు.. అలా ఇవ్వకపోగా, వాటికి వచ్చే వచ్చే ఆదాయానికి కన్నం పెడుతోంది.

నిధులపైనే సర్కార్‌ చూపు

స్వర్ణ పంచాయతీ వెబ్‌ పోర్టల్‌, ఈ–గవర్నెన్స్‌ కార్యక్రమాల నిర్వహణకు గాను గ్రామ పంచాయతీల సొంత ఆదాయం (ఓఎస్‌ఆర్‌) నుంచి ఒక శాతం లాగేసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకు ఏకంగా జీవోనే ఇచ్చింది. ఇప్పుడు నిధుల మళ్లింపునకు గ్రామసభల తీర్మానాల కోసం సర్క్యులర్‌ ఇచ్చి పంచాయతీ కార్యదర్శులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. అసలే అంతంత మాత్రపు సొంత ఆదాయ వనరులతో, ప్రభుత్వాలు ఇచ్చే అరకొర నిధులతో నెట్టుకొస్తున్న గ్రామ పంచాయతీలపై ఈ నిర్ణయంతో కూటమి ప్రభుత్వం పిడుగు వేసింది. గుంటూరు జిల్లాలో 257 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీలు సుమారు రూ. 65 కోట్ల వరకు ప్రతి ఏడాది రకరకాల పన్నుల రూపంలో సొంత ఆదాయం సమకూర్చుకుంటాయి. ఈ ఓన్‌ సోర్స్‌ రెవెన్యూ (ఓఎస్‌ఆర్‌)లో ఏటా ఒక శాతం నిధులను ఈ–గవర్నెన్స్‌, స్వర్ణ పంచాయతీ పోర్టల్‌, ఐటీ కార్యకలాపాల కోసం కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంటే సుమారుగా జిల్లా నుంచి రూ. 65 లక్షల వరకు ఆదాయాన్ని బట్టి చెల్లించనున్నారు.ఇందుకు గాను ఈ ఏడాది జూలై 8వ తేదీన జీవో ఎంఎస్‌ నంబర్‌ 89ను పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ కమిషనర్‌ ఎంవీఆర్‌కే తేజ జారీ చేశారు. అంతేకాకుండా జీవో ఆధారంగా ఆగస్టు 24వ తేదీన పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ కార్యాలయం సర్క్యులర్‌ 3360053 కూడా జారీ చేసింది.

పంచాయతీలపై ఆర్థిక భారం..

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామ పంచాయతీలు, మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారాలపై తీవ్ర ప్రభావం పడనుంది. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ.. వంటి స్థానిక అవసరాలకు అంతంత మాత్రంగా ఉండే ఈ నిధుల నుంచి ఒక శాతం రాష్ట్ర స్థాయి సాంకేతిక అవసరాలకు మళ్లించడం సరికాదన్న అభిప్రాయాలు ఆయా వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇది పంచాయతీలకు ఆర్థిక భారమేనని పేర్కొంటున్నారు.

అవి ఉంటేనే ప్రత్యేక ఖాతాకు మళ్లింపు..

పంచాయతీ కార్యదర్శి పంచాయతీ తీర్మానాన్ని పోర్టల్‌లో అందుబాటులో ఉంచి, ధ్రువీకరణ పూర్తయిన తర్వాత సంబంధిత గ్రామ పంచాయతీ ఓఎస్‌ఆర్‌ నుంచి ఒక శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మినహాయించనుంది. అలా పంచాయతీల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయనున్నట్లు చెబుతున్నారు.

మైనర్‌ పంచాయతీల పరిస్థితి ఏంటో..

ఓఎస్‌ఆర్‌లో ఒక శాతం అనేది పెద్ద మొత్తంగా కనిపించకపోయినప్పటికీ, సొంత ఆదాయం తక్కువగా వచ్చే మైనర్‌ పంచాయతీలపై మాత్రం అధికంగా కనిపించనుంది. మైనర్‌ పంచాయతీలకు వచ్చే ఆదాయంలో ప్రతి రూపాయి వారికి ఎంతో కీలకం. అలాంటి పంచాయతీల్లో ఒక్క శాతం నిధుల మళ్లింపు స్థానిక మౌలిక వసతుల అవసరాలపై ఎంతో కొంత ప్రభావం పడనుంది.

ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ఇంటి పన్నులు, నీటి పన్నులు, చేపల వేలం పాటలు, నీటి కుళాయిల కనెక్షన్లు, ఫీజులు.. ఇలా అనేక వనరుల ద్వారా ఆదాయం వస్తుంది. మేజర్‌ పంచాయతీలకు జనాభాను బట్టి రూ. కోట్లలో, మైనర్‌ పంచాయతీలకు రూ. లక్షలు, రూ. వేలల్లో ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయంపై కన్నేసిన చంద్రబాబు సర్కారు ఓఎస్‌ఆర్‌లో ఒక శాతాన్ని రాష్ట్రస్థాయి ఈ–గవర్నెన్స్‌ వ్యవస్థ కోసం లాగేసుకుంటోంది. ఈ నిధులను ఈ–గవర్నెన్స్‌ అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్‌, టెక్నికల్‌ యూనిట్‌, స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ నిర్వహణ, డిజిటల్‌ సేవలు, ఐటీ మౌలిక వసతులు తదితరాలకు వినియోగించనుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఒక శాఖకు సంబంధించిన ఐటీ నిర్వహణ, వ్యయం అంతా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వమే భరించాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా, వీటిని కూడా నిర్వహించలేక.. చేతులెత్తేసి ఆ మొత్తాన్ని పంచాయతీల నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు సిద్ధమవ్వడం శోచనీయం.

సర్క్యులర్‌ జారీ చేసిన తేదీ నుంచి వారం లోపల సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో అన్ని పంచాయతీ కార్యదర్శులు తీర్మానాలు చేసి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేలా చూసే పనిలో జిల్లా పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యాయి. పంచాయతీల్లో పాలకవర్గాలు ఉన్న సమయంలో అయితే వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న ఆలోచనతో, వారు లేని సమయంలో ప్రత్యేకాధికారులు ఉన్న ఈ తరుణంలో ఇలా తీర్మానాలు చేయించడం కూడా విమర్శలకు దారితీస్తుంది. గ్రామస్థాయిలో తక్షణ అవసరాలు అనేకం ఉండగా.. వాటి కంటే ముందుగా రాష్ట్రస్థాయి డిజిటల్‌ వ్యవస్థకు నిధుల సమీకరణను టాప్‌ ప్రాధాన్యతగా అమలు చేయడంపై ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

2025–26 ఆర్థిక సంవత్సరం నుంచే 1% ఓఎస్‌ఆర్‌ కాంట్రిబ్యూషన్‌ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తీర్మానం చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా తీర్మానాన్ని పంచాయతీ కార్యదర్శి అధికారికంగా ద్రువీకరించి స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని కూడా ఆదేశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement