జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ | - | Sakshi
Sakshi News home page

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

Sep 25 2026 2:11 AM | Updated on Sep 25 2026 2:11 AM

గుంటూరు వెస్ట్‌: ఆర్‌ అండ్‌ ఆర్‌ సర్వే శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ అధికారులను ఆదేశించారు. సీఆర్‌డీఏ భూ సమీకరణ, ఇతర పనుల పురోగతిపై గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాలులో కలెక్టర్‌ సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్‌ అండ్‌ ఆర్‌ సర్వే పూర్తి చేసి ప్రచురణకు వెళ్లాలన్నారు. రికార్డు పరమైన ఆధారాలు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించాలని ఆదేశించారు. సబ్‌ డివిజన్‌ వచ్చే గురువారం నాటికి పూర్తి కావాలని తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఈ వారంలో పూర్తి చేయాలన్నారు. భూ సమీకరణలో ప్రతి వారం పురోగతి కనిపించాలని అన్నారు. సమావేశంలో సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ ఏ.భార్గవ్‌ తేజ, జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్వో షేక్‌ ఖాజావలి, గుంటూరు, తెనాలి ఆర్డీఓలు కె.శ్రీనివాసరావు, కె.శ్రీరమణి, సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement