కారకులైన పోలీసులపై చర్యలేవీ! | - | Sakshi
Sakshi News home page

కారకులైన పోలీసులపై చర్యలేవీ!

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

ఎస్సీ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తాం..

దళిత యువకుడి మృతికి

నగరంపాలెం: దళిత యువకుడు చీకటి గోపి మృతికి పోలీసులే కారణమని మొదట్నుంచి చెబుతున్నామని ఎమ్మార్పీస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన దళిత యువకుడు చీకటి గోపి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ గోపి భార్య, కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు, రెండు రాష్ట్రాల సీనియర్‌ న్యాయవాదులు సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గోపి మృతిపై జిల్లా ఎస్పీతో చర్చించారు. గోపి మృతిపై కుటుంబ సభ్యుల ఆవేదన, ఘటనా స్థలంలో గోపితోపాటు ఉన్న గోపికృష్ణ వాంగ్మూలం, రెండు రాష్ట్రాల మాల, మాదిగ వర్గాల న్యాయవాదుల నిజనిర్ధారణతో కూడిన నివేదికను జిల్లా ఎస్పీకి సమర్పించారు.

గోపి మృతిపై సిట్‌ ఏర్పాటుకు అంగీకారం..

అనంతరం ఎమ్మార్పీస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ మీడియాతో మాట్లాడుతూ చీకటి గోపి మృతిపై సిట్‌ ఏర్పాటుకు అంగీకరించినట్లు చెప్పారు. దీనికి జిల్లా ఏఎస్పీ(ఎల్‌/ఓ) రవికుమార్‌ నేతృత్వం వహించనున్నారని పేర్కొన్నారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టపరంగా, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గోపీ చనిపోయిన దగ్గర్నుంచి దళిత, బహుజన ప్రజా సంఘాలు, కుటుంబ సభ్యులు అనేక పోరాటాలు చేశాయని గుర్తు చేశారు. చీకటి గోపి మృతిపై ఆధారాలు సమీకరించుకుంటూ ముందుకెళ్తుంటే, మరోవైపు పోలీసులు ఆధారాలను కనుమరుగు చేసే ప్రయత్నాలు పోలీసులు చేసిన ముందుకెళ్లామని చెప్పారు. తాడికొండ పీఎస్‌ సీఐపై వచ్చిన ఆరోపణలపై ఆ స్థాయి పోలీస్‌ అధికారి అయిన మేడికొండూరు పీఎస్‌ సీఐ మధుసూదనరావుతో విచారణ చేయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఐ మధుసూదనరావు విచారణలో కొన్ని తప్పులు బయటపడ్డాయని చెప్పారు. ఆ తప్పులను ఆధారంగా చేసుకుని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ ప్రకటన ఎందుకు చేశారని మండిపడ్డారు.

గోపి మృతిపై నెలకొన్న అనుమానాలపై త్వరలో ఎస్సీ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని మందకృష్ణ చెప్పారు. ఇప్పటి వరకు తాడికొండ పీఎస్‌ సీఐ ఉమేష్‌ను వీఆర్‌కు లేదా సస్పెండ్‌ చేయలేదని మండిపడ్డారు. సాయికృష్ణ మృతి చెందిన పోలీసులను జైళ్లల్లో పెట్టారని, ఒక దళిత యువకుడు లాకప్‌డెత్‌ అయితే కనీసం సీఐను వీఆర్‌కు లేదా సస్పెండ్‌ చేయకపోవడం ఏంటని అన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి 30 మంది న్యాయవాదులు చీకటి గోపి మృతిపై లాకప్‌డెత్‌, సహజ మరణామా అనేది పర్యటించి వివరాలు సేకరించామని మాదిగ లాయర్ల ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు వీరదాసు వెంకటరత్నం అన్నారు. పొన్నెకల్లులోని గోపి కుటుంబం, మాల/మాదిగ పల్లెల్లో వివరాలు, స్థానిక ప్రాథమిక హెల్త్‌ కేంద్రం అధికార సిబ్బందితో ఫోన్‌లో సంప్రదించామని అన్నారు. గోపి లాకప్‌డెత్‌కు కారణమైన సీఐ ఉమేష్‌ వద్ద వివరాలు తీసుకున్నామని చెప్పారు. గతనెల 25 ఉదయం నుంచి 27వ తేదీ మధ్యాహ్నం వరకు పోలీస్‌స్టేషన్‌లోనే నిర్బంధించారని పేర్కొన్నారు. నెల్లూరు రాజా వచ్చి పోలీసులను కలిసిన తర్వాత విచక్షణారహితంగా చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయకుమార్‌, ఎంజే విద్యాసాగర్‌, బత్తుల వీరాస్వామి పాల్గొన్నారు.

సిట్‌ ఏర్పాటుకు

అంగీకరించిన పోలీసులు

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక

అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

ఎస్పీకి వినతిపత్రం అందించిన

దళిత ప్రజా బహుజన

సంఘాల నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement