ఉద్యోగాల పేర్లతో మోసగించారని ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేర్లతో మోసగించారని ఫిర్యాదులు

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

ఉద్యోగాల పేర్లతో మోసగించారని ఫిర్యాదులు బెదిరింపులకు పాల్పడుతున్నారు కోర్టులో ఉద్యోగమని.. మహిళ పేరు చేర్చడంలేదు.. సీఎంతో దిగిన ఫొటో చూయించి.. ●

పీజీఆర్‌ఎస్‌కు అర్జీల వెల్లువ

ఫిర్యాదులు స్వీకరించిన

ఎస్పీ వకుల్‌ జిందాల్‌

నగరంపాలెం: ఉద్యోగాల పేర్లతో లక్షలు కాజేశారని బాధితులు వాపోయారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును జిల్లా ఎస్పీ పరిశీలించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు సీతారాం, బెల్లం శ్రీనివాసరావు ఫిర్యాదులు స్వీకరించగా, 215 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు ఫిర్యాదిదారులకు అన్నదానం చేశారు.

సమస్య అలకిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

విశదలలో నాలుగు ఎకరాల పొలం ఉంది. అయితే పొలం విషయంలో ఓ వ్యక్తి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు వ్యక్తి కొంత మందిని ఇంటి వద్దకు తీసుకువచ్చి గలాటా స్పష్టించాడు. అంతేగాక ఇష్టానుసారంగా బూతులతో ధూషించారు. పొలంలో వేప, ఇతరత్రా చెట్లు నాటేందుకు వెళ్తే అక్కడ అడ్డుపడి నానాయాగీ చేశారు. దీనిపై గతంలో రెండుసార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదు. వృద్ధాప్యంలో ఇబ్బందులకు గురవుతున్నా. న్యాయం చేయగలరు.

– కళ్ళం శేషమ్మ,

శ్యామలానగర్‌ ఒకటో వీధి

తెలిసిన వ్యక్తులు జిల్లా కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారు. దీంతో గతేడాది జూన్‌లో వారికి లక్షన్నర చెల్లించా. అయితే ఉద్యోగ విషయామై అడిగితే కాలయాపన చేస్తున్నారు. కనీసం చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత నాలుగు నెలలుగా మొబైల్‌ నంబర్‌ బ్లాక్‌ చేశారు. న్యాయం చేయగలరు.

– షేక్‌.షఫీ, మంగళదాస్‌నగర్‌.

గతనెల్లో నా భర్త వెంకన్నను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యలో కీలకంగా వ్యవహరించిన మహిళ పేరుని కేసులో నమోదు చేయలేదు. సదరు మహిళ ఆ రోజు రాత్రి, ఉదయం రెక్కీ నిర్వహించింది. నా భర్త కళ్లల్లో కారం చల్లి, మెడపై కత్తితో దాడికి పాల్పడింది. అయితే ఇప్పటి వరకు ఆమె పేరుని కేసులో చేర్చలేదు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి ఆమె పేరుని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని కోరుతున్నాం.

– పి.వెంకటమ్మ, కేవీపీకాలనీ

గతేడాది వికాస్‌నగర్‌లో ఉంటున్న తెలిసిన వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. నా భార్యను నల్సార్‌ లా కళాశాలలో క్లర్క్‌గా చేర్పిస్తానని నమ్మించాడు. రూ.20 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అతడికి రెండుసార్లుగా రూ.10 లక్షలు అడ్వాన్స్‌ చెల్లించా. దీంతో ఆఫర్‌ లెటర్‌ ఇచ్చి ఓ ప్రైవేటు కంపెనీలో అడ్మిన్‌గా గుర్తింపుకార్డు జారీ చేశాడు. మంగళగిరిలో కంపెనీ కార్యాలయం చూయించి, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌, సదరు కంపెనీ ప్రతినిధులతో దిగిన ఫొటోలను చూయించి నమ్మించాడు. ఉద్యోగంలో ఎప్పుడు చేరాలనేది దాటవేశాడు. దీంతో అనుమానం వచ్చి డబ్బులు అడగా, రూ.6 లక్షలు చెల్లించి మిగతా రూ.4 లక్షలు చెల్లించలేదు. డబ్బులు అడిగితే నాపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నాడు. ఆ కేసులు తొలగించేందుకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేస్తున్నాడు.

– భానుకుమార్‌,

బాలాజీనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement