అర్జీలకు సత్వర పరిష్కారం చూపండి | - | Sakshi
Sakshi News home page

అర్జీలకు సత్వర పరిష్కారం చూపండి

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

అర్జీలకు సత్వర పరిష్కారం చూపండి నిర్లక్ష్యంతో నా బిడ్డను చంపేశారు కోల్డ్‌ స్టోరేజ్‌ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి లక్ష్మీపురం: దుగ్గిరాల శుభమ్‌ మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీ బాధిత రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం పసుపు రైతులు భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల క్రితం కోల్డ్‌ స్టోరేజీ దగ్ధమై కాగా సుమారు 300 మంది రైతులు నష్టపోయినట్లు చెప్పారు. రైతులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. నాడు ప్రతిపక్షంలో నారా లోకేష్‌, పెమసాని చంద్రశేఖర్‌ తదితర కూటమి నాయకులు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పసుపు రైతుల సంఘం నాయకులు ములకా శివసాంబిరెడ్డి, వేముల వెంకటరామయ్య మాట్లాడారు. అనంతరం స్పందనలో డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జి.శ్రీహరి, వై.వెంకటేశ్వరరావు, కె.శేషగిరిరావు, డీవీ సుబ్బారావు, శొంఠి ప్రసాద్‌, కుర్ర బ్రహ్మయ్య, కె.లక్ష్మణరావు, నాదెండ్ల చంద్రశేఖర్‌, ఎల్‌.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనుమతులు లేని విద్యాసంస్థలపై చర్య తీసుకోవాలి లక్ష్మీపురం: గుంటూరు జిల్లాలో ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలకు గుర్తింపు, అనుమతులపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి సుదర్శనం అమర్నాథ్‌ కోరారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వివిధ ప్రైవేట్‌ విద్యాసంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు నగర నాయకులు మహేష్‌, సతీష్‌, ప్రత్తిపాడు అధ్యక్షులు డేవిడ్‌ రాజు, పూర్ణ, నితిన్‌ పాల్గొన్నారు. లక్ష్మీపురం: పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఎస్‌.ఐ, కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ వలి డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మస్తాన్‌ రావు ,రాజేష్‌ ఏఐవైఎఫ్‌ నాయకులు అమర్నాథ్‌, డేవిడ్‌, మహేష్‌ పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ

గుంటూరు వెస్ట్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం నాణ్యతతో కూడినదై ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ ఎంతోదూరం నుంచి వ్యయప్రయాసలకు ఓర్చి ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో అర్జీలను అందజేస్తుంటారని, వారి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలన్నారు. అధికారులు అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. అనంతరం వచ్చిన 410 అర్జీలను డీఆర్వో షేక్‌ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్‌ డేవిడ్‌, డ్వామా పీడీ శంకర్‌, డీఈఓ సలీం బాషా, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, అధికారులు పరిశీలించారు.

గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో నా కుమార్తె నూర్‌ బాషా రంజాన్‌బీ ప్రాణాలు కోల్పోయింది. వైద్యులిద్దరూ సెల్‌ఫోన్‌ చూసుకుంటూ ఇష్టానుసారంగా సర్జరీ చేశారు. ప్రజల ప్రాణాలంటేవారికి లెక్కలేదు. వైద్యులకు సరైన శిక్ష విధించడంతోపాటు మా కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని మనవి...

– మృతురాలి తల్లి అల్లాబీ, సిరిపురం

పోలీస్‌ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

పారిశ్రామికవేత్త నూకల వేణు మృతి

తెనాలి: పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు(68) మృతిచెందారు. గతేడాది అనారోగ్యం కారణంగా అమెరికాలో చికిత్స తీసుకుని, తెనాలి వచ్చిన వేణుగోపాలరావు చెకప్‌ కోసమని ఇటీవల అక్కడకు వెళ్లారు. అక్కడ భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎన్‌ఆర్‌కే టెక్స్‌టైల్స్‌ చైర్మన్‌గా పారిశ్రామికరంగంలో కొనసాగుతున్న వేణుగోపాలరావు, పట్టణంలో గుప్తా కాలేజి కరస్పాండెంట్‌గా ఉన్నారు. తన తండ్రి నూకల రామకోటేశ్వరరావు పేరిట బోసురోడ్డులో కళ్యాణ కళాసదనం ఉంది. బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం కమిటీ అధ్యక్షునిగా సుదీర్ఘకాలంగా ఉన్న వేణుగోపాలరావు, ఆ దేవస్థానం అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణస్వామి ఆలయం, పలు కళ్యాణమండపాలను నిర్మించి, ఆర్యవైశ్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెరికా నుంచి ఆయన భౌతికకాయాన్ని స్వస్థలం తెనాలికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement